Bharat vs Aus
3rd T20
: భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య
జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో భాగంగా నేడు కీలక పోరు జరగనుంది. గువాహటిలోని
బర్సపరా స్టేడియం వేదికగా జరిగే నేటి మ్యాచులో గెలిస్తే సిరీస్ భారత్ సొంతం
అవుతుంది.
గువాహటి మ్యాచుకు వాన ముప్పు దాదాపు లేదని వాతావరణశాఖ తెలిపింది. 20 శాతం పాక్షిక మేఘావృతం
అవుతుందని, వాన మాత్రం కురిసే అవకాశం లేదని వెల్లడించింది. తేమ ఎక్కువగా ఉన్నందున
గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఇప్పటికే ఈ సిరీస్ లో
భారత జట్టు 2-0 ఆధిక్యం సాధించింది.
సిరీస్ రేసు లో నిలిచేందుకు ఆసీస్ కు ఈ మ్యాచు
చావోరేవో సమస్యగా మారింది. మొదటి రెండు మ్యాచుల్లో విశ్రాంతి తీసుకున్న ట్రావిస్
హెడ్, నేడు ఆడే అవకాశముంది.
గువాహటిలో
ఇప్పటి వరకు మూడు టీ 20 మ్యాచులు మాత్రమే జరగగా, అందులో భారత్ వెర్సస్ శ్రీలంక
పోరు వాన కారణంగా రద్దు అయింది. ఈ గ్రౌండ్ లో 2017లో భారత్ పై ఆస్ట్రేలియా 8
వికెట్ల తేడాతో నెగ్గింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో భారత్ 16 పరుగుల
తేడాతో విజయం సాధించింది.
టీ20ల్లో
మరో 60 పరుగులు చేస్తే సూర్యకుమార్ కూడా రికార్డు క్రియేట్ చేస్తాడు. రెండు వేల
పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్ గా ఘనత సాధిస్తాడు