ఆఫ్రికా ఖండంలోని మరో దేశంలో సాయుధ తిరుగుబాటు పరిస్థితులు నెలకొన్నాయి. సియర్రా లియోన్ లోని మిలటరీ బ్యారక్స్ పై గుర్తు తెలియని సాయుధులు దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళారు. పలు జైళ్లపై దాడులు చేసి భారీ సంఖ్యలో ఖైదీలను విడిపించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి అంగీకరించారు.
ఫ్రీటౌన్ పడెంబా రోడ్డులోని జైలును కూడా బద్దులు కొట్టారు. అవాంఛనీయ పరిస్థితి తలెత్తడంతో దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పరిణామంపై స్పందించిన అధ్యక్షుడు జులియస్ మాదా బయో బ్యారెక్స్ వద్ద భద్రతా ఉల్లంఘన అని పేర్కొన్నారు. దాడి చేసిన వారిలో చాలా మందిని ఇప్పటికే అరెస్టు చేశామన్నారు.
హఠాత్ పరిణామంపై పశ్చిమాఫ్రికా ఆర్థిక సమూహం (ఎకోవాస్) ఆందోళన వ్యక్తం చేసింది.
‘‘ సియర్రా లియోన్ లో ఆయుధాగారాన్ని ఆక్రమించుకుని శాంతిని భగ్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు.
ఆఫ్రికాలోని సాహిల్ ప్రాంతంలో బుర్కివా, ఫాసో, మాలి, చాడ్, సుడాన్ లు సైనిక పాలనలోనే ఉన్నాయి. ఇటీవల నైగర్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కుంటుంది. సియర్రా లియోన్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు బయో తిరిగి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో పారదర్శకత లోపించిందనే ఆరోపణలు అంతర్జాతీయంగా వ్యక్తం అయ్యాయి.