అమెరికాలో
ఖలీస్థానీ నిరసనకారులు (Khalistanies)మరోసారి రెచ్చిపోయారు. న్యూయార్కులోని
ఓ గురుద్వారకు వెళ్ళిన భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు(Indian Ambassador Taranjit Singh Sandhu)ను అడ్డుకుని భారత్ ప్రభుత్వాన్ని నిందించారు.
గురునానక్
జయంతి సందర్భంగా న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్ లో ఉన్న హిక్స్ విల్లే గురుద్వారలో
నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తరణ్ జిత్ సింగ్ ను ఖలీస్థానీ సానుభూతి పరులు
చుట్టుముట్టి పెద్దగా కేకలు వేశారు.
ఖలిస్థానీ
ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య లో భారత్ పాత్ర ఉందని, అలాగే సిఖ్స్ ఫర్
జస్టిస్ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ ను అంతమొందించేందుకు కుట్ర చేశారని
కేకలు వేశారు. మరికొంతమంది వారిని వారించే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గకుండా
గట్టిగా కేకలు వేశారు. తాను సేవ కోసమే గురుద్వారకు వచ్చినట్లు తరణ్ జిత్ సింగ్
నిరసనకారులకు బదులిచ్చారు.
మన
రాయబారి ఎదుట ఖలీస్థానీ సానుభూతిపరులు నిరసన తెలపడాన్నిబీజేపీ ఖండించింది. ఆ
పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ మాట్లాడుతూ ఆధారాల్లు లేకుండా నిందలు
వేయడం సరికాదని నిరసన కారుడు హిమ్మత్ సింగ్ కు చురకులు అంటించారు.
కెనడాలోని
ఖలీస్థానీ ఉగ్రవాది హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం
ఉందని ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో
ఆరోపించారు. ఈ క్రమంలో భారత దౌత్య కార్యాలయాలపై
ఖలీస్థానీ మద్దతుదారులు దాడులకు పాల్పడుతున్నారు.
భారత దేశ రాయబారులు, ఇతర ఉన్నతాధికారులు
ఎదురుపడినప్పుడు తమ అక్కసు వెళ్ళగక్కుతున్నారు.