శబరిమలకు వచ్చే అయ్యప్పస్వామి భక్తుల కోసం
కేరళ అటవీ శాఖ ‘అయ్యన్’ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో యాప్
ను తయారు చేశారు.
ఆన్లైన్, ఆఫ్లైన్ లో పనిచేసే ఈ యాప్ ద్వారా అయ్యప్ప
భక్తులు పలు సేవలు పొందే అవకాశం ఉంది.
శబరిమల వెళ్లే మార్గంలో సేవా కేంద్రాలు, అత్యవసర వైద్యం, వసతి సౌకర్యాలు,
అటవీ జంతువులు సంచరించే ప్రాంతాలు, ఫైర్, పోలీసు సహాయ
కేంద్రాలతో పాటు తాగునీటి సదుపాయాల వివరాలను ఈ యాప్ ద్వారా సులువుగా
తెలుసుకోవచ్చు.
వన్యప్రాణుల దాడులు జరిగిన సందర్భాల్లో
యాప్ ద్వారా అధికారులను సంప్రదించవచ్చని కేరళ అటవీ శాఖ వివరించింది.
శబరిమల వెళ్లే భక్తుల కోసం తెలుగు
రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్ళు నడవనున్నాయి. రానుపోను కలిపి 22 ట్రిప్పుల
ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
విజయవాడ నుంచి కొట్టాయంకు డిసెంబరు
1,8,15,22, 29, అలాగే జనవరిలో 5,12, 19 తేదీల్లో సర్వీసులు నడవనున్నట్లు దక్షిణ
మధ్య రైల్వే తెలిపింది.
సికింద్రాబాద్ నుంచి కొల్లంకు డిసెంబరు 8,
జనవరి 12,19 తేదీల్లో ప్రత్యేక రైలు
సర్వీసులు అందుబాటులో ఉంటుంది.
తిరుగు ప్రయాణంలో భాగంగా కొట్టాయం నుంచి
విజయవాడకు డిసెంబరు 3, 10, 17, 24, 31 తేదీల్లో కొల్లం నుంచి సికింద్రాబాద్ కు
జనవరి 9, 13, 20 తేదీల్లో స్పెషల్ ట్రెయిన్స్ నడుస్తాయి.