అయోధ్యలో ప్రారంభానికి రామాలయం (ayodya ramalayam) సిద్దమవుతున్న వేళ కొందరు భక్తులు వారి మొక్కలు చెల్లించుకునేందుకు సిద్దం అవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 22ను అయోధ్యలో రామాలయgలో ప్రత్యేక పూజలు ప్రారంభించనున్నారు. అయితే రామయ్యకు కానుకగా ఓ భక్తుడు తయారు చేసిన గంట అందరినీ ఆకర్షిస్తోంది.25 క్వింటాళ్ల బరువుండే గంటను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం బహుకరించనుంది. ఇటావా జిల్లాకు చెందిన గంటలు తయారు చేసే వృత్తిలో ఉన్న మిత్తల్ కుంటుంబం ఈ భారీ గంటను తయారు చేసింది. ఈ గంటను మోగించినప్పుడు ఓంకార శబ్ధం రావడం విశేషం.
ఈ గంటను 8 రకాల లోహాల మిశ్రమంతో తయారు చేశారు. జింక్, సీసం, నికెల్, వెండి, బంగారం వంటి లోహాలను ఉపయోగించి ఈ గంటను రూపొందించారు. దీని తయారీలో 250 మంది కార్మికులు పాల్గొన్నారు. మూడు నెలలపాటు శ్రమించి ఈ గంటను తయారు చేశారు. ఈ గంటను అయోధ్యలోని రామాలయంలో ఏర్పాటు చేయనున్నారు.