కార్తిక
పౌర్ణమితో పాటు సోమవారం కలిసి రావడంతో శైవక్షేత్రాలతో పాటు ప్రముఖ ఆలయాలకు భక్తులు
పోటెత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి,
కోటప్పకొండ, అమరావతి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పార్వతీపతిని కొలిచారు.
పౌర్ణమి గడియలు ఉండటంతో దీపాలు వెలగించారు. పొంగళ్ళు పెట్టి నైవేద్యం సమర్పించారు.
అన్నవరంలో
సత్యదేవుడి గిరిప్రదక్షిణలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల
కోలాహలంతో పాటు భక్తిగీతాల ఆలాపనలు, భజనలతో గిరి ప్రదక్షణ కార్యక్రమం సందడిగా
ఉంది.
గోదావరి
ఘాట్ల వద్ద తెల్లవారు జాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. పంచారామ
క్షేత్రమైన ద్రాక్షారామం, క్షణముక్తేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు
తరలివచ్చారు.
ద్వారక
తిరుమల శేషాచల కొండపై శివాలయంలో పెద్ద సంఖ్యలో
భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించారు.
వరంగల్
జిల్లాలోని శివాలయాలన్నీ శివయ్య స్మరణతో మార్మోగుతున్నాయి. హన్మకొండలోని రుద్రేశ్వరస్వామి,
సిద్దేశ్వరస్వామి దేవాలయ, భద్రకాళి భద్రేశ్వరా స్వామి దేవాలయాల్లో తెల్లవారు
జామునుంచే భక్తులు బారులు తీరారు. పర్వదినం కావడంతో కాళేశ్వరం, పాలకుర్తి సోమేశ్వర
స్వామి దేవాలయం, కురివి వీరభద్ర స్వామి, ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయాలు
కార్తిక శోభతో మరింతగా వెలుగొందుతున్నాయి.