Bharat vs Australia :
ఆసీస్తో
జరుగుతున్న రెండో టీ20(2nd
T20) మ్యాచ్
లోనూ భారత జట్టే విజయం సాధించింది. వరల్డ్కప్ -2023 విజేత జట్టును 44 పరుగులతో
తేడాతో సూర్యకుమార్ సేన ఓడించింది.
తిరువనంతపురం(Tiruvanantapuram) వేదికగా జరిగిన రెండో టీ20 లో టాస్
ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 235 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో
ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసి పరాజయం చెందింది.
భారత బౌలర్లు రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 3 వికెట్లు తీసి ఆసీస్ ను కట్టడి చేశారు.
అర్షదీప్ సింగ్, అక్షర్
పటేల్, ముఖేశ్
కుమార్ తలా ఒక వికెట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు.
ఆసీస్
జట్టులో మార్కస్ స్టొయినిస్ చేసిన 45 పరుగులే అత్యధికం. డేవిడ్ 37, స్టీవ్ స్మిత్ 19, మాథ్యూ షార్ట్ 19 పరుగులు చేశారు. తొలి మ్యాచులో సెంచరీ చేసిన జోష్
ఇంగ్లిస్ ఈ సారి 2 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆఖర్లో ఆసీస్
కెప్టెన్ మాథ్యూ వేడ్ (23 బంతుల్లో 42 నాటౌట్) దూకుడుగా ఆడినా గెలుపు
దక్కలేదు.
భారత ఇన్నింగ్స్
లో జైస్వాల్ 25బంతుల్లో 53 పరుగులు చేయగా, గైక్వాడ్ 43 బంతుల్లో 58 రన్స్
చేశారు. ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 52
పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ 10 బంతుల్లో 19
పరుగులు చేసి ఔట్ అయ్యాడు. రింకూసింగ్ 9 బంతుల్లో 31 పరుగులు చేశాడు.
ఇరు జట్ల
మధ్య మూడో టీ20 మ్యాచ్ ఈ
నెల 28న
గువాహటిలో జరగనుంది.