గుజరాత్లో అకాల వర్షం (cylcone) జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. రాష్ట్రమంతా భారీ వర్షం నమోదైంది. కొన్ని చోట్ల వడగండ్లు పడ్డాయి. అనేక ప్రాంతాల్లో పిడుగులు విరుచుకుపడటంతో 20 మంది చనిపోయినట్లు ప్రాధమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలోని 252 తాలూకాల్లో 234 ప్రాంతాల్లో పిడుగులు పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
సూరత్, సురేంద్రనగర్,ఖేడా, తాపి, భరూచ్‌లో గడచిన 16 గంటల్లోనే 117 మి.మీ వర్షపాతం నమోదైంది. రాజ్‌కోట్, మోర్బీ జిల్లాల్లో కొన్ని చోట్ల వడగండ్లు బీభత్సం సృష్టించాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో కంపెనీలు మూతపడ్డాయి.
పిడుగులు విరుచుకుపడటంతో జనం పరుగులు తీశారు. దాహోద్ జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు, భరూచ్‌లో ముగ్గురు, తాపిలో ఇద్దరు చనిపోయారు. అహ్మదాబాద్, అమ్మేలీ, సూరత్, సురేంద్రనగర్ ప్రాంతాల్లో పిడుగుపాటుకు 11 మంది మృతిచెందారని అధికారులు ప్రకటించారు.