Jobs Notifications:
దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ రంగ
సంస్థలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఎఎస్ఎస్సీ
కానిస్టేబుల్(జీడీ), ఎస్బీఐ, పోస్టల్ డిపార్టుమెంట్, ఐడీబీఐ
బ్యాంకులలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది.
కేంద్ర
సాయుధ బలగాల్లోని వివిధ విభాగాల్లో 26,146 ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్
కమిషన్(SSC) ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పదో తరగతి అర్హతతో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు డిసెంబర్ 31
లాస్ట్ డేట్.
ఇండస్ట్రియల్
డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) వివిధ కేటగిరీల్లోని 2,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
చేసింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబరు 6వరకు ఆన్లైన్ https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspxలో అప్లై చేసుకోవచ్చు.
స్టేట్
బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ కోసం
రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయగా, వీటిలో
8,773 క్లర్కు పోస్టులు, 5,280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఉన్నాయి. క్లర్కు పోస్టులకు డిసెంబర్ 7 వరకు , సీబీవో
పోస్టులకు డిసెంబరు 12 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
పోస్టల్
డిపార్టుమెంటులో ఇంటర్, డిగ్రీ అర్హతతో స్పోర్ట్స్ కోటా కింద 1,889
పోస్టులు భర్తీ చేస్తున్నారు.
పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్
మ్యాన్, మొయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు
డిసెంబరు 9 వరకు ఆన్ లైన్ లో ఆప్లై చేసుకోవచ్చు.