రెండు జాతుల వైరంలో హింసతో అట్టుడికిపోయిన మణిపూర్‌లో శాంతి చర్చలు మొదలయ్యాయి. ఇంఫాల్ లోయకు చెందిన తిరుగుబాటు నాయకులతో ప్రభుత్వం శాంతి చర్చలు (manipur peace talks) సాగిస్తోన్నట్లు మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ వెల్లడించారు. అయితే ఆ తిరుగుబాటు గ్రూపు పేరు మాత్రం బయటపెట్టలేదు. చర్చలు తుది దశకు చేరుకున్నాయని కూడా సీఎం ప్రకటించారు. త్వరలో వారితో శాంతి ఒప్పందం కుదిరే అవకాశముందన్నారు.
ఈ ఏడాది మే3న హింస మొదలైనప్పటి నుంచి శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయని ప్రభుత్వం చెప్పడం ఇదే మొదటిసారి. నిషేధిత యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌లోని ఒక వర్గంలో ప్రభుత్వం చర్చలు సాగిస్తోన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. తమ కులాన్ని ఎస్టీల్లో చేర్చాలంటూ మైతేయ్ వర్గం డిమాండ్‌కు వ్యతిరేకంగా గిరిజన సంఘీభావ యాత్ర తరవాత మణిపుర్లో హింస మొదలైన సంగతి తెలిసిందే. జాతుల మధ్య వైరంతో పరస్పరదాడులు తీవ్ర హింసకు దారితీసింది. గడచిన 7 నెలల కాలంలో మణిపుర్ హింసలో 180 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు.