Weather Repoprt: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు రోజుల
పాటు వర్ష సూచన(Rain
alert) ఉన్నట్లు
వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ దగ్గరలో కేంద్రీకృతమైన అల్పపీడనం సోమవారం తీవ్ర
వాయుగుండంగా మారే అవకాశముందని పేర్కొంది.
మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో
వాతావరణం చల్లబడగా, అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి.
నవంబర్
28న దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ,
చలి తీవ్రత కూడా మరింత పెరుగుతుందని అంచనా
వేసింది.
తమిళనాడు,
కేరళ, లక్ష్యద్వీప్ లో కూడా వర్షాలు కురుస్తాయని, మహారాష్ట్ర, గోవా, కొంకణ్ తో
పాటు అనేక ప్రాంతాల్లో అక్కడక్కడా వానలు పడతాయని వాతావరణ శాఖ తన నివేదికలో పేర్కొంది.
దిల్లీ,
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నవంబర్ 27న ఉరుములు,
మెరుపులతో వర్షం పడే అవకాశం ఉంది. యూపీ వ్యాప్తంగా రేపు అక్కడక్కడా వర్షాలు పడతాయని వెల్లడించింది.