కేరళలో
తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కొచ్చిన్ విశ్వవిద్యాలయం(kochi varsity) వార్షికోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న
తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు దుర్మరణం( students dead) చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా 60 మందికి
గాయాలయ్యాయి.
కొచ్చిన్
వర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్యాంపస్ లో వార్సికోత్సవ సంబరాలు
నిర్వహించారు. వేడుకలో భాగంగా నికితా గాంధీ సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా,
పెద్ద సంఖ్యలో విద్యార్థులతో పాటు స్థానికులు హాజరయ్యారు. అయితే ఒక్కసారిగా వాన
కురవడంతో విద్యార్థులు పరుగులు తీశారు.
ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని నలుగురు
విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కేరళ
ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.