దిల్లీ
లిక్కర్ కుంభకోణ పథకరచన అంతా తెలంగాణ కేంద్రంగా జరిగిందని బీజేపీ ముఖ్యనేత, ఎంపీ
మనోజ్ తివారి ఆరోపించారు. కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
కవిత, ఆప్ అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎప్పుడు జైలుకెళతారని తెలంగాణ ప్రజలు
అడుగుతున్నారని చెప్పారు.
తెలంగాణ
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన మనోజ్ తివారీ,
మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, అక్రమాలకు
కుసుమంతైనా అవకాశం ఇవ్వని పాలన బీజేపీతోనే సాధ్యమన్నారు.
అవినీతి
రహిత పాలనే బీజేపీ ధ్యేయమన్న మనోజ్ తివారీ, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు.
దిల్లీ లిక్కర్ కుంభకోణమైనా, తెలంగాణ గ్రామాల్లో అక్రమాలకు పాల్పడిన వారినైనా
వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
దిల్లీ
లిక్కర్ కుంభకోణం పన్నాగం అంతా తెలంగాణ కేంద్రంగా జరిగిందని, ఇప్పటికే అందుకు
బాధ్యులైను ముగ్గురు వ్యక్తులు జైలు పాలయ్యారన్నారు. కవిత, అరవింద్ కేజ్రీవాల్
జైలుకు ఎప్పుడు వెళతారని తనను ప్రజలకు అడుగుతున్నారని ఆ విషయం కోర్టులు, దర్యాప్తు
సంస్థల తేల్చాల్సి ఉంటుందన్నారు.
బీజేపీ సత్యం కోసం పోరాడుతుందని అక్రమార్కులు
చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు.
దిల్లీ మద్యం కుంభకోణంలో కేసులో భాగంగా
దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితన పలుమార్లు విచారించారు.