Karthika Masam : కార్తిక
మాసం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నారు. ఉదయమే
నదీ, సుముద్ర తీరాల్లో పుణ్యస్నానాలు చేస్తోన్న భక్తులు దగ్గరలోని ఆలయాల్లో
దేవతామూర్తులను దర్శించుకుని తరిస్తున్నారు. పర్వదినాల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు
నిర్వహిస్తుండగా అధిక సంఖ్యలో భక్తులు భాగస్వాములు అవుతున్నారు.
శివకేశవుల
నామస్మరణతో తెలుగు ప్రాంతం మార్మోగుతోంది.
ద్వాదశ
జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో సందడి వాతావరణం నెలకొంది. వేకువజామునే
ఆలయం వద్దకు చేరుకున్న భక్తులు కార్తిక దీపారాధనలు చేశారు. గంగాధర మండపం, ఉత్తర
మాఢవీది ప్రాంతమంతా దీపాలతో నిండింది.
నేటి
సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు పౌర్ణమి గడియలు ఉండటంతో పాతాళగంగ వద్ద
పుణ్యనది హారతి నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
కృష్ణవేణీ నదీమతల్లికి
కర్పూర నీరాజనాలు సమర్పించిన అనంతరం , గంగాధర మండపం వద్ద శ్రీభ్రమరాంబ,
మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు జ్వాలాతోరణోత్సవం జరుపుతారు.
త్రిమూర్తి
స్వరూపుడైన అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో రేపు ఉదయం గిరి ప్రదక్షిణ
నిర్వహిస్తున్నారు. రత్నగిరి తొలిపావంచా నుంచి రత్న, సత్యగిరిలను కలుపుకుంటూ
పంపాతీరం మీదుగా తొలి పావంచా వద్ద
ప్రదక్షిణ ముగుస్తుంది.
సత్యదేవుని ఉత్సవమూర్తులను పల్లకిలో సోమవారం ఉదయం
7.30 గంటలకు కొండపై నుంచి మెట్లమార్గంలో తొలి పావంచాల వద్దకు తీసుకొస్తారు. అక్కడ
ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రదక్షిణ ప్రారంభం అవుతుంది. ప్రదక్షిణ మార్గం దూరం 8.4 కిలోమీటర్లు
ఉంటుంది. దాదాపు లక్ష మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు అంచనా
వేస్తున్నారు.