ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి సమీపంలోని సొరంగంలో 15 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులను రక్షించడానికి చేపట్టిన భారీ డ్రిల్లింగ్ నిలిచిపోయింది. డ్రిల్లింగ్ చేస్తోన్న జెయింట్ డ్రిల్ యంత్రంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని అధికారులు వెల్లడించారు. పలుమార్లు యంత్రం మొరాయించడంతో ఇక మనుషులతో డ్రిల్ (manuel drilling to save tunnel workers) చేయించాలని నిపుణులు భావిస్తున్నారు. ఇది వారాల పాటు కూడా పట్టవచ్చని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. 41 మంది కార్మికులు 15 రోజులుగా ఇప్పటికే సొరంగంలో చిక్కుకుపోయారు. వారికి సన్నటి పైపు ద్వారా ఆహారం, నీరు, మందులు అందిస్తున్నారు.
అమెరికా నుంచి తీసుకు వచ్చిన భారీ యంత్రం మొరాయించడంతో, మనుషులతోనే డ్రిల్లింగ్ చేయించాలని భావిస్తున్నారు.ఇంకా 10 నుంచి 15 మీటర్లు తవ్వితేగాని చిక్కుకుపోయిన కార్మికులను వెలికితీయడం సాధ్యం కాదు. ఇది ఎంత కాలం పడుతుందనేని చెప్పలేమని కూడా అధికారులు స్పష్టం చేశారు.