Bharat vs
Australia 2nd T20: ఆస్ట్రేలియాతో
టీ-20 సిరీస్(T20 cricket) లో భాగంగా నేడు తిరువనంతపురం వేదికగా రెండో
మ్యాచ్ జరగనుంది. విశాఖలో జరిగిన మొదటి మ్యాచ్ లో విజయం సాధించిన సూర్యకుమార్ సేన,
నేటి మ్యాచుకు సమాయత్తమైంది.
తొలి
మ్యాచ్ లో ఆడిన జట్టే నేడు కూడా బరిలోకి దిగే అవకాశముంది.
యశస్వి జైస్వాల్,
రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేయనుండగా, ఇషాన్ కిషన్ వన్ డౌన్ లో దిగనున్నారు.
సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకూసింగ్ తో మిడిలార్డర్ పటిష్ఠంగా ఉంది. బౌలర్లు
మాత్రం చాలా మెరుగుపడాల్సి ఉంది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ పై ఆస్ట్రేలియా
బ్యాటర్లు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది.
తిరువనంతపురం
పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం. ప్రస్తుత వాతావరణం పేసర్లకు సహకరించేలా ఉంది. టాస్
గెలిచే జట్టు బౌలింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది.
నేటి
మ్యాచుకు వరుణగండం పొంచి ఉంది. శనివారం వర్షం పడగా పిచ్ ను కవర్లతో
కప్పారు. ఇవాళ కూడా వాన పడే అవకాశం ఉంది. మ్యాచ్ పూర్తిగా రద్దు కానప్పటికీ
అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ స్టేడియంలో మూడు టీ20 మ్యాచులు ఆడిన భారత
జట్టు, రెండుసార్లు నెగ్గింది. 2017లో న్యూజీలాండ్ ను 2022లో దక్షిణాఫ్రికాను
ఓడించగా, 2019లో వెస్టిండీస్ చేతిలో ఓడింది.