ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ (israel hamas seize fire) ఒప్పందంలో భాగంగా ఇవాళ రెండో విడత బందీలను విడుదల చేశారు. హమాస్ ఉగ్రవాదులు వారి చెరలో ఉన్న 13 మంది ఇజ్రాయెలీలు, నలుగురు థాయ్ జాతీయులను ఆదివారం విడుదల చేసింది. ఖతార్, ఈజిప్టు దేశాల మధ్యవర్తిత్వంతో నాలుగు రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ ఒప్పందంలో భాగంగా 50 మంది ఇజ్రాయెల్ బందీలను, 150 మంది పాలస్తీనా ఖైదీలకు విముక్తి లభించనుంది.
ఆదివారం రాత్రి బందీలను హమాస్ ఉగ్రవాదులు ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది. తాజాగా రెండో విడత విడుదలైన 13 మంది ఇజ్రాయిలీల్లో ఆరుగురు మహిళలు, ఏడుగురు చిన్నారులు, కొందరు యువకులు ఉన్నారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. హమాస్ ఉగ్రవాదులు విడుదల చేసిన బందీలకు బదులుగా ఇజ్రాయెల్ 39 మంది పాలస్తీనా పౌరులను జైళ్ల నుంచి విడుదల చేసింది.