ఉత్తరాఖండ్
లోని సిల్కియారా సొరంగంలో చేపట్టిన సహాయ చర్యల్లో మరో అడ్డంకి ఏర్పడింది. ఆఖరి
ఘట్టం సహాయ చర్యల్లో ఊహించని అవరోధం ఏర్పడటంతో అధికారులు మల్లగుల్లాలు
పడుతున్నారు. డ్రిల్లింగ్ చేపట్టిన ఆగర్ మెషిన్ బ్లేళ్ళు విరిగిపోవడంతో పనులు
నిలిచిపోయాయి. దీంతో మాన్యువల్ డ్రిల్లింగ్ చేయడమే ఉత్తమమని నిపుణుల బృందం నిర్ణయించింది.
ఆగర్
మిషన్ బ్లేడ్లు దెబ్బతినడంతో అది పనికిరాకుండా పోయిందని, ప్రత్యామ్నాయ మార్గంలో
మాన్యువల్ డ్రిల్లింగ్ కు చర్యలు చేపట్టినట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్
సింగ్ ధామి తెలిపారు.
14
రోజులుగా కొనసాగుతున్న సహాయ చర్యల్లో అనేక సమస్యలు తలెత్తాయి. ఇప్పటి వరకు ఆగర్
మిషన్ ద్వారా 48.6 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేసి స్టీల్ పైపులు ఏర్పాటు చేశారు. మరో
12 మీటర్ల పైపు ఏర్పాటు చేస్తే కార్మికులను బయటకు తీసుకురావచ్చు. కానీ అందుకోసం
చేపట్టిన డ్రిల్లింగ్ పనులు ముందుకు సాగడం లేదు. దీంతో మిగతా 12 మీటర్ల
డ్రిల్లింగ్ ను మాన్యువల్ గా చేపట్టాలని నిపుణులు నిర్ణయం తీసుకున్నారు.
రేపు ఉదయం
తర్వాత ఆ పనిని ప్రారంభించనున్నారు.
ఆగర్
మిషన్ తో పనులు చేసే సమయంలో ఏదైనా అడ్డంకి ఏర్పడితే దానిని తొలగించి మళ్లీ మెషన్
ను సెట్ చేసేందుకు సుమారు 5 నుంచి ఆరు గంటల సమయం పడుతోంది. అందువల్ల సహాయ చర్యల్లో
తీవ్ర జాప్యం జరుగుతుందని, ప్రస్తుతం, సమాంతర డ్రిల్లింగ్ కు సంబంధించిన పనులు
చివరిదశలో ఉన్నందున మాన్యువల్ గా డ్రిల్లింగ్ చేయడం ఉత్తమమని సహాయ చర్యల్లో
పాల్గొన్న ఓ అధికారి చెప్పారు.