విశాఖ
ఫిషింగ్ హార్బర్ అగ్రిప్రమాదానికి కారణమైన నిందితులు ు వాసుపల్లి నాని, అతని మామ
సత్యంగా తేలినట్లు సీపీ రవిశంకర్ అయ్యర్ తెలిపారు. మద్యం మత్తులో నిందితులు చేసిన
తప్పిదం కారణంగానే మంటలు అలుముకున్నట్లు తమ దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు.
ఓ
బోటులో మద్యం తాగుతున్న నిందితులు మత్తులో సిగిరెట్ ను పక్కబోటులో విసిరేశారని
బోటు ఇంజిన్ పై అది పడటంతో మంటలు చెలరేగి ప్రమాదం సంభవించిందన్నారు. బోట్లలో
నైలాన్ వలలు ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. ఈ ఘటనలో 30 బోట్లు కాలి బూడిద
అయ్యాయన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాసుపల్లి
నాని, అతని మామ సత్యం, అల్లిపల్లి వేంకటేష్ కు చెందిన బోటులో ఈ నెల 19 తేదీ
సాయంత్రం మద్యం తాగారు. మద్యం తాగి ఫిష్ ఫ్రై చేసుకున్నారు. అనంతరం సిగిరెట్ తాగి
పక్కన ఉన్న బోటులో వేశారు. మంటలు చెలరేగిన తర్వాత అక్కడ నుంచి జారుకున్నారని
పోలీసులు వెల్లడించారు.
కేసు
దర్యాప్తులో భాగంగా చాలా మంది అనుమానితులను విచారించామని పేర్కొన్న సీపీ ,
అనుమానితుల్లో ముగ్గురు నానిలు ఉన్నారన్నారు. దర్యాప్తులో భాగంగానే యూట్యూబర్
నానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించామన్నారు.