స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన
తేలికపాటి యుద్ధ విమానం తేజస్ (Tejas
aircraft)లో ప్రధాని నరేంద్ర మోదీ(PM
MODI) విహరించారు. కర్ణాటక (Karnataka)లో పర్యటిస్తున్న ప్రధాని బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్
లిమిటెడ్ సందర్శించారు. అక్కడ తయారు
అవుతున్న యుద్ధ విమానాలను ఆయన పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తేజస్ లో ప్రయాణంపై స్పందించిన ప్రధాని
మోదీ, తేజస్ ప్రయాణంతో మన స్వదేశీ సామర్థ్యంపై నా విశ్వాసం మరింత పెరిగిందన్నారు. మన దేశ శక్తి సామర్థ్యాల పట్ల నాకు గర్వంగా
ఉందన్న మోదీ. ఇది మన శాస్త్రవేత్తల కృషి, అంకితభావానికి నిదర్శనం అన్నారు.