విశాఖపట్టణం
ఫిషింగ్ హార్బర్ ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. దీనికి సంబంధించి పోలీసులు కీలక
ఆధారాలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా ఫిషింగ్ హార్బర్ సమీపంలోని పెట్రోలు బంక్
సీసీటీవీ రికార్డింగ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి ముందు దృశ్యాలను
పరిశీలించారు.
ఘటన జరగడానికి కొన్ని నిమిషాల ముందు బోటు నుంచి ఇద్దరు వ్యక్తులు
బయటకు రావడం అందులో రికార్డు అయింది. ఈ ఘటనతో వారికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో
పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
ప్రమాదం
జరిగిన నవంబర్ 19న రాత్రి 10.48 గంటలకు
బోటు నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకు రాగా, రాత్రి 10.50 గంటలకు మంటలు చెలరేగినట్లు
సీసీటీవీ రికార్డింగ్ ద్వారా తేలింది. దీంతో ఆ సమయంలో బయటకు వస్తున్న వారిని
ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ కేసులో యూట్యూబర్ నాని సహా పలువురు
అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.