రాజస్థాన్(Rajasthan) అసెంబ్లీ
ఎన్నికల పోలింగ్
ప్రారంభమైంది. మొత్తం
200 శాసనసభ స్థానాలు
ఉండగా 199 చోట్ల పోలింగ్(Voting begins)
ప్రారంభమైంది. కాంగ్రెస్
అభ్యర్థి మరణంతో కరనాపూర్ ఎన్నిక వాయిదా పడింది.
అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు
ఒడ్డింది.
ఈసారి ఎలాగైనా సరే పాలకపార్టీ స్థానాన్ని
కైవసం చేసుకోవాలని బీజేపీ పోరాడింది.
బీజేపీ నేతలంతా ఏకతాటిపై నిలబడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో ఈ సారి రాజస్థాన్ ను తమ ఖాతాలో వేసుకోవడం ఖాయమని కాషాయ నేతలు ధీమా వ్యక్తం
చేస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ ఫైలట్ జైపుర్ లోని
సివిల్ లైన్స్ ప్రాంతంలో ఓటు వేశారు. ఆయన టోంక్ స్థానం నుంచి పోటీలో ఉన్నారు.
కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తూర్పు బికనేర్ లో ఓటు వేయగా, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జోధ్
పుర్ లో , కైలాశ్ చౌధరీ బర్మేర్ లో ఓటు హక్కు వినియోగించుకుననారు. మాజీ సీఎం,
బీజేపీ నేత వసుంధరా రాజే, ఝలావర్ లో ఓటు వేశారు.
ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు
కొనసాగనుంది. ఉదయం 9 గంటల కల్లా 9.77 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 51,890 పోలింగ్ స్టేషన్లలో 5, 26,90, 146 మంది
ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
18 నుంచి 30 ఏళ్ళ మద్య వయస్సు ఉన్న ఓటర్లు 1,70, 99,334 మంది ఉండగా, కొత్తగా ఓటు హక్కు పొందిన వారి సంఖ్య 22,61,008. మూడు లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా
ఓటు వేశారని ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించారు.