ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతీయ విద్యావేత్త సాదు తన్వీర్దాస్ లీలారామ్
వాస్వానీ జయంతి సందర్భంగా నేడు ఆ రాష్ట్రంలో
నో నాన్ వెజ్ డే(no non-veg day) గా ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని మాంసం దుకాణాలతో
పాటు కబేళాలను
మూసివేయాలని ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసింది.
సాధు తన్వీర్దాస్ లీలారామ్ వాస్వానీ(Sadhu TL Vaswani) భారతదేశానికి చెందిన గొప్ప విద్యావేత్తలో ఒకరు. మీరా ఉద్యమాన్ని ప్రారంభించడంతో పాటు సెయింట్
మీరా స్కూల్ స్థాపించారు. పాకిస్తాన్
లోని సింధు ప్రావిన్స్ లోని హైదరాబాద్ లో ఈ స్కూలు ఉంది. 1879 నవంబరు 25న జన్మించారు.
శాకాహారులుగా జీవించాలని
సమాజానికి ఉద్భోదించాడు.
విద్యారంగం అభివృద్ధికి ఆయన అందించిన సేవలకు గుర్తింపు
ఆయన పుట్టిన రోజును అంతర్జాతీయ మాంస రహిత దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాము. 86 ఏళ్ళ వయసులో 1966 జనవరి 16న ఆయన తుదిశ్వాస
విడిచారు.
హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులపై నవంబర్ 18న నిషేధం
విధించిన యోగీ ప్రభుత్వం, తాజాగా నవంబర్ 25ను మాంసం రహిత దినోత్సవంగా జరుపుకోవాలని
ఉత్తర్వులు జారీ చేసింది.