డీప్‌ఫేక్
ఘటనల(deep fake) నియంత్రణకు కేంద్రప్రభుత్వం చర్యలు
చేపట్టింది. త్వరలోనే వీటి నియంత్రణ కోసం ఓ అధికారిని నియమిస్తామని కేంద్రమంత్రి
రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి
తెస్తామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం నుంచి మద్దుతు లభిస్తుందని
స్పష్టం చేశారు.
డీప్
ఫేక్ ఘటనలకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో
సమావేశం నిర్వహించిన కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, నిబంధనలు పాటించని సంస్థలను
ఉపేక్షించమని తేల్చి చెప్పారు. సోషల్ మీడియా సంస్థలపై తొలుత కేసులు నమోదు చేస్తామని, ఒక వేళ ఆయా సంస్థలు
కంటెంట్ సోర్సు వివరాలు వెల్లడిస్తే అప్పుడు బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని
వివరించారు.
సోషల్
మీడియా సంస్థలు తమ టర్మ్ ఆఫ్ యూజ్ ను ఐటీ నిబంధనలకు అనుగుణంగా మార్చాలని ఆదేశించిన
కేంద్రం, అందుకు వారం గడువు ఇస్తున్నట్లు తెలిపింది.