క్రమశిక్షణ అనుసరించేందుకు మన హిందూ సాంప్రదాయాలు, మేథో వ్యత్యాసాలను తొలగించాల్సిన అవసరముందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధిపతి మోహన్ భాగవత్ ధాయ్‌లాండ్‌లో అభిప్రాయపడ్డారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం. అందరూ ఆర్య సంస్కృతి నుంచి వచ్చిన వారేనని ఆయన గుర్తుచేశారు.మెరుగైన ప్రపంచం కోసం సంస్కృతి అనేది ఒక్కటే ప్రస్తుతం సరిపోవడం లేదు. సంస్కృతి, సత్యం, అహింస అనేవి విజయానికి మూల సూత్రాలని మోహన్ భాగవత్ (mohan bhagawat) స్పష్టం చేశారు.
భారత సాంప్రదాయాలపై కొందరి మధ్య బేధాబిప్రాయాలున్నాయి. ఉదాహరణకు ధర్మ. క్రమశిక్షణ పాటించేందుకు అన్ని సాంప్రదాయాలను శుద్దీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మనం ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి అక్కడి ప్రజల
హృదయాలను హద్దుకుంటాం. వారు అంగీకరించినా, అంగీకరించకపోయినా అందరితో కలసిమెలసిఉంటామని ధాయ్‌లాండ్‌లో జరిగిన ప్రపంచ హిందూ మహాసభలో మోహన్ భాగవత్ అన్నారు.
ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ హిందూ సమావేశాలు ధాయ్‌లాండ్ క్యాపిటల్ ధాయ్‌లో జరుగుతుంటాయి. ఈ సమావేశాలను ప్రపంచ హిందూ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. నవంబరు 24 నుంచి 26 వరకు జరుగుతున్న సమావేశాల్లో మోహన్ భాగవత్ పాల్గొని ప్రసంగించారు. భారత్ ధన విజయ్, అసుర విజయాలను చవిచూసిందని భాగవత్ గుర్తుచేశారు.
ధన విజయ్ అంటే ప్రజలు ఆస్తులు పోగేసుకునేందుకు ఒకరిని ఒకరు అధిగమించాలని చూస్తారని ఇది మంచిది కాదని ఆయన అన్నారు. అసుర విజయ్ను కూడా భారత్ చవిచూసింది. 5200 సంవత్సరాలుగా అనేక మంది మన దేశాన్ని పాలించి దోచుకున్నారని గుర్తుచేశారు. అనేక మంది విదేశీ పాలకులు 250 సంవత్సరాల పాటు భారత్‌ను లూటీ చేశారని భాగవత్ చెప్పారు.
వచ్చే ఏడాది జనవరి 22 నుంచి ప్రారంభం కానున్న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాలను బ్యాంకాక్‌లో కూడా లైవ్ ప్రసారం చేయనున్నట్లు ప్రపంచ హిందూ
ఫౌండేషన్ అధిపతి విజ్ఞాననానంద్ చెప్పారు.