ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan)కి మంజూరైన బెయిల్‌ను రద్దు
చేయాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు
విచారించింది.
ఈ వ్యాజ్యంపై జస్టిస్ అభయ్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం
విచారణ చేపట్టింది.
జగన్ బెయిల్ ను సీబీఐ, ఈడీ కూడా సవాల్ చేయకపోవడాన్ని రఘురామకృష్ణరాజు
తరపు న్యాయవాది ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. పదేళ్లుగా జగన్ బెయిల్ పై ఉన్నారని,
అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్ష్యాలు చెరిపేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం అందుకు తగిన ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. దీంతో
కేసు పూర్వాపరాలతో పాటు పలు సంఘటనలను ఉటంకిస్తూ లిఖితపూర్వకంగా వివరాలను న్యాయవాది
అందజేశారు.
సీఎం జగన్ తోపాటు, సీబీఐ సహా ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు
నోటీసులు జారీ చేసింది. మరోవైపు కేసు విచారణను హైదరాబాద్ నుంచి దిల్లీకి మార్చాలని రఘురామకృష్ణం
రాజు ఇప్పటికే పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను జతచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం
ఆదేశించింది.