రాష్ట్రంలోని
ప్రముఖ ఆలయాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు
ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేస్వార
స్వామి దేవస్థాన అభివృద్ధి పనులకు డిసెంబర్
7న సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నరని చెప్పారు. దుర్గమ్మ ఆలయాన్ని రూ. 225 కోట్లతో
అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.
శ్రీశైల
క్షేత్రంలో డిసెంబర్ 8న రూ. 125 కోట్లతో అభివృద్ధి పనులు మొదలవుతాయన్నారు. రూ. 80
కోట్లతో శ్రీ వీర వేంకటసత్యనారాయణ స్వామి కొలువైన అన్నవరం ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు
తెలిపారు. సింహాచల క్షేత్రం అభివృద్ధి పనుల కోసం రూ. 60 కోట్లు, ద్వారకా తిరుమల
ఆలయం అభివృద్ధి కోసం రూ. 70 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.