వన్డే వరల్డ్ కప్ నెగ్గిన తరవాత దానిపై కాళ్లు పెట్టిన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్‌పై కేసు (mitchell marsh resting his legs on world cup) నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్‌కు చెందిన సామాజిక కార్యకర్త పండిట్ కేశవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ గేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వరల్డ్ కప్‌పై మిచెల్ కాళ్లు పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ట్రోఫీని అవమానించడంతోపాటు 142 కోట్ల భారతీయుల మనోభావాలను దెబ్బతీశాడంటూ కేశవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మిచెల్ మార్ష్ చేష్టలపై భారత క్రీడాకారులు కూడా స్పందించారు. మార్ష్ అలా చేయడం బాధించిందని భారత క్రికెటర్ షమి అభిప్రాయపడ్డారు. మార్ష్ చేసిన పనితో ఆస్ట్రేలియా పరువు తీసుకుందన్నారు. వరల్డ్ కప్ కోసం అనేక దేశాలు తలపడ్డాయి. అలాంటి ట్రోఫీని గెలుచుకున్నాక తలమీద పెట్టుకోవాలి, కానీ ఇలా కాళ్ల కింద పెట్టుకోవడం బాధించిందని షమీ వ్యాఖ్యానించారు.