తిరుమల(Tirumala)లో కైశిక ద్వాదశి ఆస్థానం
శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున 4గంటల 45 నిమిషాల నుంచి గంట పాటు ఈ
వేడుక జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో
విహరించి భక్తులను అనుగ్రహించారు.
అనంతరం స్వామి, అమ్మవార్లను బంగారువాకిలి చెంత
వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనం చేశారు. ఈ ప్రక్రియనే కైశిక ద్వాదశి ఆస్థానం
అంటారు.
వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే
ఉగ్రశ్రీనివాసమూర్తిని(Ugra Srinivasa
) శ్రీదేవి, భూదేవి సమేతంగా కైశిక
ద్వాదశి రోజు మాత్రమే తిరుమాడ వీధుల్లో ఊరేగించడం విశేషం.
తిరుమల
తిరుపతి దేవస్థానంలో (TIRUMALA
TIRUPATI)వచ్చే
ఏడాది ఫిబ్రవరి 16న రథ సస్తమి పర్వదినానికి సంబంధించిన శ్రీవారి సేవా స్లాట్లను ఈ
నెల 27న ఉదయం 10 గంటలకు టీటీడీ(TTD)
ఆన్లైన్ లో విడుదల చేయనుంది.
తిరుమల,
తిరుపతిలో భక్తులు స్వచ్ఛంద సేవ చేసేందుకు గాను వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి
సంబంధించిన శ్రీవారి సేవ, నవనీత సేవా
కోటాను అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. మధ్యాహ్నం
మూడు గంటలకు పరకామణి సేవా కోటాను విడదల చేస్తారు.