ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ఆప్ఘనిస్తాన్ ప్రకటించింది. నవంబరు 23 నుంచే రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా (Afganistan Embassy Closed) మూసివేశారు. ముందుగా సెప్టెంబరు 30న ఎంబసీలో కార్యకలాపాలు నిలిపివేశారు. ఆప్ఘనిస్తాన్‌లోని తాలిబన్ల చర్యల కారణంగా ఆ దేశానికి కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి.
ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాక వారు భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఢిల్లీలోని ఆప్ఘనిస్తాన్ రాయబార కార్యాలయ సిబ్బంది ఖర్చులను చెల్లించడం భారత్ నిలిపేసింది.ఆప్ఘనిస్తాన్‌కు వెళ్లేవారు కూడా గణనీయంగా తగ్గిపోవడంతో కార్యాలయ నిర్వహణ ఖర్చులు చెల్లించేందుకు భారత్ నిరాకరించిదనే వార్తలు వచ్చాయి. దీంతో రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ఆప్ఘనిస్తాన్ ప్రకటించింది.