ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం (israel hamas seize fire agreement) నేటి నుంచి అమల్లోకి రానుంది. కాల్పుల విరమణపై ఇరు పక్షాలు శుక్రవారం రాత్రి తుది నిర్ణయానికి వచ్చాయి. ఇవాళ బందీల విడుదల ప్రక్రియ మొదలు కానుంది. గురవారం నుంచే బందీల విడుదల మొదలు కావాల్సి ఉండగా అడ్డంకులు ఎదురయ్యాయి. గురువారం అర్థరాత్రి వరకు ఖతర్ ఇరువర్గాలతో చర్చించి కాల్పుల విరుమణకు తుదిరూపు ఇచ్చింది.
ఇవాళ ఉదయం 7 గంటల నుంచి నాలుగు రోజుల పాలు కాల్పుల విరమణ అమల్లో ఉంటుంది. ఇజ్రాయెల్, హమాస్ బందీలకు పరస్పరం విడుదల చేసుకుంటాయి. హమాస్ 50 మందిని, ఇజ్రాయెల్ 150 మందికి విడుదల చేయనున్నాయి. విడుదలకు అర్హులైన 300 మంది జాబితాలను ఇరువర్గాలు విడుదల చేశాయి. గాజాలో భారీగా సాయం అందించేందుకు కూడా ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం 13 మంది బందీలను మొదటి విడత విడుదల చేయనున్నారు. ఇందులో మహిళలు, పిల్లలున్నారు.
గత నెల అక్టోబరు 7 నుంచి మొదలైన యుద్ధంలో ఇప్పటి వరకు 13500 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6 వేల మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. కాల్పుల విమరణను మరింత పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.