టీ20లో భారత్ శుభారంభం చేసింది. ప్రపంచ కప్ ఓటమి విమర్శలకు భారత యువ ఆటగాళ్ల తగిన సమాధానం చెప్పారు. విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మొదటి మ్యాచ్‌లో (T20) భారత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఆటగాళ్లు నిర్ధీత 20 ఓవర్లలో 208 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా జట్టులో జోష్ ఇంగ్లిస్ 110 పరుగులు, స్మిత్ 52 పరుగులతో ఆకట్టుకున్నారు. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేశారు. 209 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన భారత్ 19.5 ఓవర్లలో 209 పరుగులుచేసి విజయం దక్కించుకుంది.
భారత్ ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ 42 బంతుల్లో 80 పరుగులు, ఇషాన్ కిషన్ 58, రింకూ 22 పరుగులు చేశారు. 19.5 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ప్రకటించారు. టీ20లో భారత్ 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.