క్యాష్
ఫర్ క్వైరీ ఆరోపణలు ఎదుర్కోంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రీ వ్యవహారంపై ఆ పార్టీ
అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. లోక్సభ నుంచి మహువాను
బహిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన మమతా బెనర్జీ, ఎన్నికల
ముందు అలాంటి చర్యలు ఆమెకు మేలే చేస్తాయన్నారు.
కోల్కతా
లోని నేతాజీ స్టేడియంలో నిర్వహించిన టీఎంసీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మమతా
బెనర్జీ, మహువా అంశంపై తొలి సారి స్పందించారు.
విపక్ష
నేతలను లక్ష్యంగా చేసుకుంటున్న కేంద్ర సంస్థలు, 2024 ఎన్నికల తర్వాత బీజేపీతోనే
వెళ్తాయన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండేది మరో మూడు నెలలే అని జోస్యం
చెప్పారు.
ముడుపులు
తీసుకుని లోక్ సభలో ప్రశ్నలు వేశారనే ఆరోపణలపై ఎంపీ మహువా, పార్లమెంట్ ఎథిక్స్
కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. ఆమెను లోక్సభ నుంచి బహిష్కరిస్తారనే వార్తలు
గుప్పుమన్నాయి. ఈ విషయంపై కొన్ని రోజులుగా మౌనం వహించిన టీఎంసీ నేతలు, ఇప్పుడిప్పుడే
ఆమెకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. పార్టీలో కూడా కీలక బాధ్యతలు అప్పగించారు.