విశాఖ నగరంలో 35 ప్రభుత్వ శాఖలకు కార్యాలయాల భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు కూడా భవనాలు కేటాయించారు. మొత్తం 2.27 లక్షల చదరపు అడుగుల స్థలం కేటాయించారు. విశ్రాంతి భవనాలను కూడా గుర్తించారు.
ఆంధ్రా యూనివర్సిటీ, రుషికొండ,చినగదిలి సమీపంలో ఈ భవనాలు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఎండాడ, హనుమంత్వాక ప్రాంతాల్లో భవనాలు కేటాయించారు. అధికారుల కమిటీ సూచనల మేరకు భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడ అనే విషయం మాత్రం జీవోలో వెల్లడించలేదు.