పాకిస్తాన్
కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత రక్షణ దళాలు మట్టుబెట్టాయి. జమ్ము-కశ్మీర్
రాష్ట్రం రాజౌరిలో భారత ఆర్మీ, పాకిస్తాన్ ఉగ్రవాదుల మధ్య 24 గంటల పాటు జరిగిన
ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. కాలాకోట్ లో నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో
నలుగురు ఆర్మీ జవాన్లు అమరులు కాగా, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మరో
సైనికులు నేడు ప్రాణాలు విడిచాడు.
మృతి
చెందిన తీవ్రవాదుల్లో ఒకరు పాకిస్తాన్ దేశీయుడైన ఉగ్రవాది క్వారిగా తేలింది. ఐఈడీ బాంబుల తయారీలో నిష్ణాతుడైన క్వారి.. స్నైపర్‌గా కూడా శిక్షణ
తీసుకున్నాడని, పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉగ్రవాదం వ్యాప్తికి పనిచేస్తున్నాడని భద్రత
దళాల అధికారులు చెబుతున్నారు.
డాంగ్రీ, కాండీ దాడుల వెనుక సూత్రధారి అతడేనని, రాజౌరీ-పూంచ్
ప్రాంతంలో ఉగ్రవాదాని కి మళ్ళీ జీవం పోసే పనిని అతడికి ఉగ్రసంస్థలు అప్పగించాయని రక్షణ శాఖ వర్గాలు
వెల్లడించాయి.
జబిమాల్ గ్రామంలో ఉగ్రవాదులకు ఆహారం సరఫరా
చేసేందుకు గుజ్జర్ వ్యక్తి నిరాకరించాడు. దాంతో అతడిపై విచక్షణా రహితంగా
దాడిచేశారు. ఈ విషయాన్ని గ్రామస్తులు భద్రతా దళాలకు చేరవేశాయి.
వెంటనే రంగంలోకి
దిగిన భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
భద్రతా బలగాలపై ముష్కరులు కాల్పులకు
తెగబడ్డారు. ఈ ఘటనలో సైన్యం ఐదుగురు వీరులను కోల్పోయింది.
2003 తర్వాత పీర్ పంజాల్ అటవీ ప్రాంతంలో తీవ్రవాద సమస్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది.
2021 తర్వాత మళ్ళీ మొదలయ్యాయి. ఈ
ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 30 మంది ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు.
దట్టమైన అటవీ ప్రాంతాలు, గుహలు ఉగ్రవాదులకు స్థావరాలుగా ఉపయోగపడుతున్నాయి.