విద్యార్థినిపై ఓ ఉపాధ్యాయుడు దారుణానికి పాల్పడ్డాడు. మాయమాటలతో
విద్యార్థినికి తాళి కట్టి ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి
జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భీమవరం గ్రామీణ
మండలానికి చెందిన పురెళ్ళ సోమరాజు, జిల్లాలోని ఓ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా
పనిచేస్తున్నాడు. ఆ పాఠశాలలో చదువుకుంటున్న
ఓ విద్యార్థినిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి బైక్ పై ఎక్కించుకుని సొంతూరుకు
తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు తాళి కట్టి అనంతరం లైంగికదాడికి పాల్పడ్డాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమరాజుపై
అత్యాచారం, ఫోక్సో, బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు
పోలీసులు తెలిపారు.