డీప్‌ఫేక్ వీడియోల కట్టడికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి నియంత్రణకు త్వరలో కొత్త నిబంధనలు తీసుకురానున్నట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. డీప్‌ఫేక్ వీడియోలు (deepfake) తయారు చేసే వారికి, ఆ వీడియోల వ్యాప్తికి కారణం అయ్యే సామాజిక మాధ్యమాలకు భారీ జరిమానా విధించే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.
డీప్‌ఫేక్ వీడియోల కట్టడిపై గురువారం కేంద్రం కీలక సమావేశం నిర్వహించింది. సామాజిక మాధ్యమాల సంస్థలు, నాస్కామ్, ఏఐ నిపుణులతో చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ప్రజాస్వామ్యానికి డీప్‌ఫేక్ వీడియోలు పెనుముప్పుగా పరిణమించే ప్రమాదముందని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని కట్టడి చేయడానికి తక్షణ చర్యల అవసరం ఉందన్నారు.