భారత్, ఆస్ట్రేలియా( Bharat vs Australia) జట్ల మధ్య జరిగే ఐదు మ్యాచుల టీ 20(T20I series) సీరిస్ లో భాగంగా నేడు విశాఖ(visaka) వేదికగా తొలి పోరు జరగనుంది.
రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు మ్యాచ్ జరగనుంది.
టీ-20
సమారానికి వాతావరణం ప్రతికూలంగా మారడంపై క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ
శాఖ(imd) తెలిపింది. మ్యాచ్ పూర్తిగా
తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం లేకపోయినప్పటికీ అవాంతరం ఏర్పడే అవకాశం ఉంది.
వరల్డ్కప్
లో ఆడిన ప్రధాన ఆటగాళ్ళకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వడంతో ఈ సిరీస్ లో భారత
యువజట్టు బరిలోకి దిగుతోంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా, జాతీయ
క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్ గా ఉన్నారు.
ఇషాన్ కిషన్, ప్రసిధ్ కృష్ణ, యశస్వి జైస్వాల్,
రుతురాజ్ గైక్వాడ్ జట్టులోకి రావడంతో ఒపెనర్ల స్థానానికి పోటీ ఎక్కువగా ఉంది.
తిలక్
వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్ లతో మిడిల్ ఆర్డర్ పటిష్ఠంగా ఉంది. గాయాలతో ప్రపంచ
కప్ టోర్నీకి దూరమైన అక్షర పటేల్ ఈ మ్యాచ్ లో ఆడబోతున్నాడు. లెగ్ స్పిన్నర్ రవి
బిష్ణోయ్ కూడా అందుబాటులోకి వచ్చారు.
ఆస్ట్రేలియా
టీమ్ లో కూడా పలువురు సీనియర్లకు విశ్రాంతి ప్రకటించారు. ట్రవిస్ హెడ్, మ్యాక్స్ వెల్, జంపా రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది.