లెబనాన్
మిలిటెంట్ సంస్థ హెజ్‌బొల్లాకు నిధులు సమకూర్చాడనే అభియోగాలపై బ్రిటన్ లో
నివసిస్తున్న భారతీయ అకౌంటెంట్ ను అమెరికాకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. మిలిటెంట్
సంస్థ హెజ్‌బొల్లాకు నిధులు సమకూర్చాడనే ఆరోపణల కింద ఈ ఏడాది ఏప్రిల్ లో బ్రిటన్
పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడు
రాష్ట్రం మధురైలో జన్మించిన 66 ఏళ్ళ సుందర్ నాగరాజన్, 2016 నుంచి యూకేలో నివాసం
ఉంటున్నాడు. అకౌంటెంట్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు. హెజ్‌బొల్లాకు ఆర్థిక వనరులు
సమకూరుస్తున్న నజీమ్ అహ్మద్‌కు సాయంగా నాగరాజన్ భారీ ఎత్తున మనీలాండరింగ్ కు
పాల్పడినట్లు, నిబంధనలు ఉల్లంఘించినట్లు అమెరికా ఆరోపించింది.
తనది
హిందూ నేపథ్యమని ఇస్లామిక్ ఉగ్రవాదానికి తాను మద్దతు ఇవ్వడం లేదని కోర్టులో
నాగరాజన్ వివరణ ఇచ్చారు. న్యాయస్థానం అతడి వాదనలు పరిగణనలోకి తీసుకోలేదు.
అమెరికాకు అప్పగించేందుకు అంగీకరించింది.
2019లో
నజీమ్ ను ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా,
తమ దేశ పౌరులతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించకుండా నిషేధం విధించింది.