ఉత్తరాఖండ్
రాష్ట్రంలోని ఉత్తరకాశి
ప్రాంతంలో సిల్కియారా
సొరంగం(Uttarkashi tunnel) కూలిన ఘటనలో సహాయ చర్యలు(Rescue
operation) తుది అంకానికి చేరాయి. కార్మికులను ఇవాళ బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
నవంబర్
12న సొరంగం నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్క సారిగా కుప్పకూలడంతో 41 మంది నిర్మాణ
కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అత్యుత్తమ ఇంజినీరింగ్ నిపుణులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న అధునాతన
సాంకేతికతను ఉపయోగించి కార్మికులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్
ప్రభుత్వం సంయుక్తంగా తీరికలేకుండా పనిచేస్తున్నాయి.
ఛార్ధామ్
ప్రాజెక్టులో భాగంగా సిల్కియారా వద్ద కొండను తవ్వుతుండగా 57 మీటర్ల మేర సొరంగం కూలడంతో నిర్మాణ కార్ముకులు
అందులో చిక్కుపోయారు.
బుధవారం
నాటికే 45 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేసి పైపు ను జొప్పించారు. మరో 12 మీటర్లు
తవ్వితే కార్మికులు చిక్కుకున్న చోటుకు పైపు ద్వారా చేరుకోవచ్చు.
దాదాపు మీటరు వ్యాసమున్న స్టీల్ పైపులోంచి
కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఈరోజు
కార్మికులను బయటకు తీసుకురావడమే లక్ష్యంగా సహాయదళాలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే 15 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సొరంగం లోపలికి
వెళ్ళారు. కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చేందుకు వీరంతా సహకరిస్తారు.
కార్మికులు
బయటకు రాగానే వారికి అత్యవసర వైద్యం అందించేందుకు డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. ఇతర
ఆస్పత్రులకు తరలించేందుకు 12 అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే సంఘటనా
స్థలంలో 41 పడకల తాత్కాలిక ఆస్పత్రిని సిద్ధం చేశారు. మరీ అత్యవసరం అనుకుంటే
హెలీకాప్టర్ ద్వారా కూడా తరలించేందుకు చర్యలు చేపట్టారు.