ఏపీలో కులగణనకు రంగం సిద్దమైంది. ఈ నెల 27 నుంచి వారం రోజుల పాటు కులగణన చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు ఇప్పటికే అందాయి. ఫైలట్ ప్రాజెక్టు కింద 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో సర్వే పూర్తి చేశారు. ఈ నెల 27 నుంచి వారం పాటు రాష్ట్ర వ్యాప్తంగా కులగణన (caste census) చేయనున్నారు. డిసెంబరు 3 నాటికి సర్వే పూర్తి కానుంది.
వార్డు, గ్రామ కార్యదర్శులు కులగణన చేయనున్నారు. 20 అంశాలను కులగణనలో తెలుసుకోనున్నారు. ఇందులో వాలంటీర్ల సేవలను కూడా ఉపయోగించుకుంటారు. ఇంట్లో ఎవరూ లేని పక్షంలో…అలాంటి వారికి మరో వారం సమయం ఇవ్వనున్నారు. కులగణన కోసం వాలంటీర్లకు ప్రత్యేక యాప్ అందించారు. పూర్తి వివరాలు అందులో నమోదు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా కులం, ఉపకులం, మతం, రేషన్ కార్డు నంబరు, విద్యార్హతలు, ఇంటి రకం, నివాస స్థల విస్తీర్ణం, వ్యవసాయ భూమి, మరుగుదొడ్డి, వంట గ్యాస్, తాగునీటి సాదుపాయాలు ఉన్నాయా లేవా తెలుసుకోనున్నారు.