ఘోర రైలు ప్రమాదం తప్పింది. సుందర్‌గఢ్ జిల్లా రవుర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (vandebharat express) సహా మరో రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి. అదృష్ణవశాత్తూ ఘోర ప్రమాదం తప్పింది. సంబల్పూర్ రవుర్కెలా మెము రైలు, రవుర్కెలా ఝార్సుగూడ పాసింజర్ రైలు ఎదురెదెరుగా వచ్చి వంద మీటర్ల దూరంలో ఆగిపోయాయి. అదే సమయంలో వందేభారత్ రైలు ఆ ట్రాప్‌పై ప్రయాణిస్తోంది.
ప్యాసింజర్ రైళ్లు ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన రవుర్కెలా స్టేషన్‌కు కేవలం 200 మీటర్ల దూరంలో జరిగింది. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల వల్లే
ఇలా జరిగిందని భావిస్తున్నారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా రైల్వే అధికారులు కళ్లు తెరవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.