ప్రముఖ
పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానంలో ఈ నెల 26 నుంచి నారసింహ స్వామి మాలధారణలు
జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. నవంబర్ 26 నుంచి జవనరి 6 వరకు ఈ కార్యక్రమం
జరుగుతుందని వివరించారు.
మాలధారణ
చేసే భక్తులకు తులసిమాల, స్వామివారి ప్రతిమ ఉచితంగా అందజేసినట్లు ఓ ప్రకటనలో
వెల్లడించింది.
27న కార్తిక మాసం రెండో సోమవారం పురస్కరించుకుని వరాహ పుష్కరిణి
వద్ద గంగా హారతి ఇవ్వనున్నట్లు తెలిపారు. గంగా హారతి కార్యక్రమంలో పాల్గొనే
భక్తులకు నూనె, ప్రసాదం, ఆవు పేడతో చేసిన
ప్రమిదలు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు.
సింహగిరిపై డిసెంబర్ 23న ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని
వైభవంగా నిర్వహించనున్నారు. ఆ రోజు స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి తరలివచ్చే
భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు.