కెనడాలో వేర్పాటువాద సిక్కు ఉగ్రవాది నిజ్జర్ హత్య (nijjar) తరవాత ఆ దేశ ప్రధాని ట్రూడో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. రెండు నెలల కిందట భారత్ కెనడా పౌరులకు వీసాలు నిలిపేసింది. నేటి నుంచి కెనడాకు వీసా సేవలు ప్రారంభించినట్లు భారత విదేశాంగశాఖ ప్రకటించింది.
సిక్కు ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ ఏజంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.సెప్టెంబరు 21న భారత్ కెనడాకు వీసా సేవలు నిలిపేసింది. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా పదేపదే చేసిన ఆరోపణలను భారత్ కొట్టివేసింది. సాక్ష్యాలు ఉంటే చూపాలంటూ భారత్ డిమాండ్ చేసింది. ఇంత వరకు కెనడా సరైన ఆధారాలు చూపలేకపోయింది.