మణిపుర్లో తెగల మధ్య రాజుకున్న
ఘర్షణలు రాజకీయ సమస్య అని తూర్పు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రాణా ప్రతాప్
కలిత అన్నారు. భద్రతా బలగాల నుంచి అపహరించిన వేల ఆయుధాలను స్వాధీనం చేసుకునే వరకు
హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయన్నారు.
హింసను అరికట్టి, రాజకీయపరమైన
సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనేలా ఇరు పక్షాలను ప్రోత్సహించేందుకు యత్నిస్తున్నట్లు
చెప్పారు. భద్రతా బలగాల నుంచి తీసుకెళ్ళిన నాలుగువేల ఆయుధాల్లో 1,500 మాత్రమే
స్వాధీనం చేసుకున్నామని మిగిలిన వాటిని స్వాధీనం చేసుకునే వరకు హింస చెలరేగుతూనే
ఉంటుందన్నారు.
మయన్మార్లో సైన్యానికి, తిరుగుబాటుదారులకు
మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా సామాన్య ప్రజలతో పాటు, సైనిక, పోలీసు
సిబ్బంది మన భూభాగంలోకి ప్రవేశిస్తున్నారని రాణా ప్రతాప్ తెలిపారు.
ఇరు దేశాల సరిహద్దుల్లో నివసించే
ప్రజలు ఒకే తెగకు చెందిన వారు కావడంతో భారత్,
మయన్మార్ పౌరులను గుర్తించడం కష్టంగా
ఉందన్నారు.