అక్రమాస్తుల కేసులో పదేళ్లుగా బెయిల్‌పై ఉన్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి (ap cm ys jaganmohanreddy) బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. రఘురామరాజు పిటీషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం నాడు విచారించనుంది. వచ్చే శుక్రవారం జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు గతంలో తెలంగాణ హైకోర్టులో వేసిన పిటీషన్ కొట్టివేశారు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజకీయ నాయకులపై ఉన్న క్రిమినల్, అక్రమాస్తుల కేసులను త్వరితగతిన విచారణ జరిపాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు కింది కోర్టులను ఆదేశించిన నేపథ్యంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ మరోసారి సంచలనంగా మారింది.