ఒంగోలు
మెడికల్ కాలేజీ స్టూడెంట్స్‌కి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు
కొడుతోంది. కొందరు విద్యార్థులు వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. క్లాస్ రూమ్
వేదికగా కొట్లాటకు దిగి సినిమా ఫైట్ రేంజ్ లో గుంపులుగా విడిపోయి పరస్పర దాడులు
చేసుకున్నారు.
కాలేజీ
ఆవరణతో పాటు హాస్టల్ లో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
హాస్టల్ లో మద్యం, సిగిరెట్లు, హుక్కాలు పీలుస్తూ మత్తులో తేలుతున్నారని ఎవరైనా
అభ్యంతరం తెలిపితే దాడులకు తెగబడుతున్నారనే వాదన కూడా ఉంది.
ఆగస్టులో
కొందరు విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. హాస్టల్ నుంచి సస్పెండ్
చేశారు. వారంతా డే స్కాలర్స్ గా తరగతులకు హాజరయ్యారు. కొన్ని రోజుల కిందట మళ్ళీ
హాస్టల్ లోకి అనుమతించారు. తమ సస్పెన్షన్ కు కారణమయ్యారంటూ తొటి విద్యార్థులతో
వీరంతా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో మాటామాటా పెరిగి ఆఖరికి క్లాస్ రూమ్
లోనే కొట్టుకునే స్థాయికి దిగజారారు.
పాత
వివాదాలు, హాస్టల్ నిర్వహణలో తలెత్తిన విభేదాల కారణంగానే ఘర్షణ జరిగిందని ఒంగోలు
డీఎస్పీ నారాయణస్వామి తెలిపారు. గంజాయి కారణంగా గొడవలు జరిగాయనే ఆరోపణలు
అర్థరహితమని ప్రిన్సిపాల్ ఏడుకొండలు అన్నారు. కొట్లాట ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని
స్పష్టం చేశారు. సామాజికవర్గాల వారీగా వీడిపోయి కొట్టుకున్నారనే వార్తల్లో కూడా
నిజంలేదన్నారు.