అనుమానిత సిక్కు గ్రూపులపై జాతీయ భద్రతా దళం (NIA Raids) పంజాబ్‌లో దాడులకు దిగింది.సిక్ ఫర్ జస్టిస్ సంస్థ కార్యాలయాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. పంజాబ్ పోలీసులు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఎస్ఎఫ్‌జేతో సంబంధాలున్న సంస్థలపై కూడా ఎన్ఐఏ దాడులు కొనసాగిస్తోంది.
ఎయిర్‌ఇండియా ప్రయాణీకులను భయపెడుతూ ఎస్ఎఫ్‌జే ఉగ్రవాది గుర్‌పత్‌వంత్ సింగ్ పనున్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
సిక్కులు ఎయిర్‌ఇండియా విమానాల్లో ప్రయాణం చేయవద్దంటూ నవంబరు 19న సోషల్ మీడియాలో ఎస్ఎఫ్‌జే పేరుతో ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఎయిర్‌ఇండియాలో ప్రయాణం చేస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. పనున్ కూడా బెదిరింపులకు దిగాడని తేలింది.
ఎయిర్‌ఇండియా ప్రపంచ వ్యాప్తంగా విమానాలు నడపడానికి వీల్లేదంటూ పనున్ హెచ్చరించడం సంలచనంగా మారింది. అతని బెదిరింపుల తరవాత రక్షణ దళాలు అప్రమత్తం అయ్యాయి. కెనడాలోని ఉగ్ర సంస్థలతో పనున్ సంబంధాలపై కూడా విచారణ జరుగుతోంది.