రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వానలు
పడతాయని వాతావరణ శాఖ(Weather Report) తెలిపింది. బంగాళాఖాతంలో
ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని
పేర్కొంది.
కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని,
అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు
వివరించారు.
బంగాళాఖాతం నుంచి గంటకు 25 కిలోమీటర్ల
వేగంతో గాలులు వీస్తున్నాయి. కోస్తా, ఉత్తరాంధ్రకంటే రాయలసీమలో గాలుల వేగం
ఎక్కువగా ఉంది.
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో
నిన్న వానలు పడ్డాయి. వర్షాల కారణంగా రైతులు
ఇబ్బందులు పడుతున్నారు. కోతకు వచ్చిన
వరిపంట ఒరిగిపోయింది.