భారత క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో (Cricket World Cup) ఆసీస్‌పై ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీనిపై అనేక మంది మాజీ క్రీడాకారులు పలు రకాల ప్రకటనలు చేశారు. ప్రపంచంలో అత్యుత్తమ జట్టు భారత్ అంటూ మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. అనేక మంది మాజీ క్రీడాకారులు కూడా భారత జట్టు ఓటమిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
ప్రపంచంలో అత్యుత్తమ జట్టుకే ప్రపంచ కప్ దక్కిందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రకటించారు. భారత్ అత్యుత్తమ జట్టు అంటూ కొందరు చేస్తున్న వాదనను ఆయన కొట్టిపారేశారు. ఇది వింత వాదన అన్నారు. ప్రపంచంలో ఆస్ట్రేలియా అత్యుత్తమ జట్టు కాబట్టే ప్రపంచ కప్ నెగ్గిందని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు.
నా వ్యాఖ్యలు చాలా మందికి నచ్చకపోవచ్చు. భారత్ ప్రపంచ కప్ గెలవలేదని చాలా మంది అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. ప్రపంచంలో అత్యుత్తమ జట్టు ఆసీస్ కాబట్టే ప్రపంచ కప్ గెలిచిందని గంబీర్ వివరించారు. అత్యుత్తమ జట్టే ప్రపంచ కప్ సాధించిందని అందరూ అంగీకరించాలని ఆయన కోరారు. భారత జట్టు బాగా ఆడలేదని, ఈ విషయానికి దూరంగా ఆలోచించవద్దని కూడా గంభీర్ హితవు పలికారు.